నల్లపాడు పీఎస్‌ వద్ద నక్కా ఆనంద్‌బాబు నిరసన

తాజా వార్తలు

Updated : 19/07/2021 11:56 IST

నల్లపాడు పీఎస్‌ వద్ద నక్కా ఆనంద్‌బాబు నిరసన

నల్లపాడు: ‘చలో తాడేపల్లి’ నిరసన కార్యక్రమం సందర్భంగా అరెస్టు అయిన యువజన సంఘాల నేతలను మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన ఆయన నేతలతో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడటానికి ప్రయత్నించగా ఆనంద్‌బాబును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల తీరును నిరసిస్తూ స్టేషన్‌ గేట్‌ వద్ద ఆందోళన తెలిపారు. 
అంతకముందు కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ‘చలో తాడేపల్లి’కి పిలుపునిచ్చిన యువజన, విద్యార్థి సంఘాల నేతలను సీఎం నివాస పరిసరాల్లో అరెస్టు చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసిన నేతలు.. సీఐ ప్రేమయ్య తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని