మా పోరాటం కొనసాగుతుంది: నామా

తాజా వార్తలు

Updated : 18/07/2021 18:56 IST

మా పోరాటం కొనసాగుతుంది: నామా

దిల్లీ: తెలంగాణకు నష్టం కలిగించే అంశాలపై తమ పోరాటం కొనసాగుతుందని తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, హక్కుల గురించి సభలో ప్రస్తావిస్తామన్నారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఇంకా పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయన్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలని సమావేశంలో కోరామని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా కోరామన్నారు. దేశ సమస్యలపై మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని తెలిపామని నామా నాగేశ్వరావు వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని