Suvendu Adhikari: అంగరక్షకుడి మృతి కేసు.. అరెస్టు నుంచి సువేందుకు ఉపశమనం!

తాజా వార్తలు

Published : 06/09/2021 22:50 IST

Suvendu Adhikari: అంగరక్షకుడి మృతి కేసు.. అరెస్టు నుంచి సువేందుకు ఉపశమనం!

కోల్‌కతా: బెంగాల్‌ ప్రతిపక్ష నేత, భాజపా ఎమ్మెల్యే సువేందు అధికారికి కోల్‌కతా హైకోర్టులో ఉపశమనం కలిగింది. తన అంగరక్షకుడు (బాడీగార్డ్‌) మరణం కేసులో అరెస్టు నుంచి ఆయనకు రక్షణ లభించింది.ఈ విషయాన్ని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. మరోవైపు, ఈ రోజు సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తాను బిజీగా ఉన్నందున దర్యాప్తునకు హాజరు కాలేనంటూ ఆయన సమాచారం ఇచ్చినట్టు అధికారులు వెల్లడించారు. నందిగ్రామ్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీపై సువేందు అధికారి విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, గతంలో ఆయన దీదీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సమయంలో తన వద్ద బాడీగార్డుగా పనిచేసిన శుభోబ్రత చక్రవర్తి 2018 అక్టోబర్‌లో  సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకొని మృతిచెందారు. ఈ వ్యవహారంపై దర్యాప్తులో భాగంగా  తమ హెడ్‌క్వార్టర్స్‌కు రావాలంటూ సువేందుకు సీఐడీ అధికారులు సమన్లు పంపారు. దీంతో ఆయన ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. 

అయితే, తనకు రాజకీయపరమైన కార్యకలాపాలు ఉన్నాయని, సీఐడీ అధికారుల ముందు విచారణకు హాజరు కాలేనంటూ ఈ ఉదయం 9.30గంటల సమయంలో సువేందు అధికారి తమకు మెయిల్‌ పంపారని సీఐడీ అధికారి ఒకరు వెల్లడించారు. మరోవైపు, సువేందు మెయిల్‌ అందిన తర్వాత సమావేశమైన అధికారులు.. ఆయనకు మళ్లీ సమన్లు పంపడం సహా తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ కేసులో సీఐడీ అధికారులు ఇప్పటివరకు 11 మంది పోలీసులతో సహా మొత్తం 15మందికి పైగా విచారణ జరిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని