‘ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదు’

తాజా వార్తలు

Updated : 24/04/2021 14:14 IST

‘ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేయడం లేదు’

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కరోనా మృతుల సంఖ్యను తక్కువగా చూపిస్తోందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. కరోనా కట్టడి, పర్యవేక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఆస్పత్రుల్లో పడకలు, మందులు దొరకని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద కరోనా చికిత్స చేయడం లేదని ఆక్షేపించారు.

‘‘పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షలు వాయిదా వేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ చేయలేదు. ఈ విషయంపై మేం పెట్టిన వాట్సాప్‌ నెంబర్‌కు 70 వేల మంది అభిప్రాయాలు పంపారు. పదో తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి రేపు మరోమారు ఆన్‌లైన్‌లో నిపుణుల అభిప్రాయాలు తీసుకుంటాం. ఈ విషయంలో అవసరమైతే న్యాయపోరాటం చేస్తాం’’ అని లోకేశ్‌ అన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని