ఫలితాలు రాకముందే.. అభ్యర్థులు రిసార్టులకు!

తాజా వార్తలు

Published : 14/04/2021 10:22 IST

ఫలితాలు రాకముందే.. అభ్యర్థులు రిసార్టులకు!

రాయ్‌పూర్‌: అస్సాం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడకముందే రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ‘మహాజోత్‌’కూటమిలో ఉన్న బోడోలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌(బీపీఎఫ్‌)కు చెందిన 9మంది అభ్యర్థులు ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌కు తరలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఈ మేరకు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నేత ఒకరు మీడియాకు ధ్రువీకరించారు. ‘అస్సాంకు చెందిన 9 మంది బీపీఎఫ్‌ అభ్యర్థులు శనివారం సాయంత్రమే రాయ్‌పూర్‌కు చేరుకున్నారు. వారిని నయారాయ్‌పూర్‌లోని ఓ రిసార్టుకు తరలించారు. అందులో బీపీఎఫ్‌ అభ్యర్థులతో పాటు మరికొందరు కాంగ్రెస్‌ నేతలు కూడా ఉన్నారు. వారంతా మే 2వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు రాయ్‌పూర్‌లోనే ఉంటారు’ అని ఆయన వెల్లడించారు.

అస్సాం శాసనసభలోని 126 స్థానాలకు ఏప్రిల్‌ 6వ తేదీన ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీపీఎఫ్‌, ఏఐయూడీఎఫ్‌, సీపీఐ(ఎం) పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలో ‘మహాజోత్‌’ పేరుతో కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగాయి. బీపీఎఫ్‌ తరపున 12 మంది అభ్యర్థుల్ని బరిలో దింపగా.. ఒకరు ఎన్నికల మధ్యలోనే భాజపాలో చేరారని స్థానిక నేతలు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని