Modi: యడియూరప్ప చేసిన అసాధారణ కృషి వెలకట్టలేనిది

తాజా వార్తలు

Published : 29/07/2021 01:52 IST

Modi: యడియూరప్ప చేసిన అసాధారణ కృషి వెలకట్టలేనిది

బొమ్మైకు నా అభినందనలు

దిల్లీ: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయనకున్న అపార అనుభవం రాష్ట్రాన్ని నడిపించడంలో సహకరిస్తుందని ట్విటర్ వేదికగా వఆశాభావం వ్యక్తం చేశారు. ‘కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బసవరాజ్‌ బొమ్మైకు అభినందనలు. ఆయన అపారమైన పాలనానుభవం కలిగిన వ్యక్తి. రాష్ట్ర అభివృద్ధికి మన ప్రభుత్వం చేసిన కృషిని ఆయన ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను’ అని ప్రధాని ట్వీట్ చేశారు. 

అలాగే మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప సేవలను ప్రధాని కొనియాడారు. ‘భాజపాను విస్తరించడంలో, కర్ణాటక అభివృద్ధికి ఆయన చేసిన కృషిని వర్ణించడానికి పదాలు సరిపోవు. దశాబ్దాలుగా కష్టనష్టాలకు ఓర్చి..ఆయన రాష్ట్ర ప్రజలతో మమేకమయ్యారు. ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధత వెలకట్టలేనిది’ అంటూ యడియూరప్పను ప్రశంసించారు. కాగా, బసవరాజ్‌ ఎంపికలో యడియూరప్ప కీలక పాత్ర పోషించారు. ఆయన అత్యంత ఆప్తుల్లో ఒకరైన బొమ్మై నాయకత్వాన్ని దాదాపు అందరు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం బొమ్మై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని