₹35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి

తాజా వార్తలు

Updated : 13/05/2021 04:55 IST

₹35వేల కోట్లను వెంటనే విడుదల చేయాలి

ప్రధాని మోదీకి 12మంది విపక్షనేతల లేఖ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 12 మంది విపక్ష నేతలు లేఖ రాశారు. కొవిడ్‌ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను విపక్ష నేతలు సూచించారు. మోదీకి లేఖ రాసిన నేతల్లో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే, తమిళనాడు సీఎం స్టాలిన్‌, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), ఫరూక్‌ అబ్దుల్లా (జేకేపీఏ), అఖిలేశ్‌ యాదవ్‌ (ఎస్పీ), తేజస్వీ యాదవ్‌ (ఆర్జేడీ), డి.రాజా (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం) తదితరులు ఉన్నారు. బడ్జెట్‌లో వ్యాక్సినేషన్‌కు కేటాయించిన ₹35 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని విపక్ష నేతలు లేఖలో కోరారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టు పనులు నిలిపి వేయాలని లేఖలో విపక్ష నేతలు పేర్కొన్నారు.

విపక్ష నేతలు రాసిన లేఖలో ప్రధానాంశాలు..

* దేశీయంగా, అంతర్జాతీయంగా అవకాశాలున్న ప్రతి చోటు నుంచి వ్యాక్సిన్‌ సేకరించాలి.

* ఉచితంగా యూనివర్సల్‌ మాస్‌ వ్యాక్సిన్‌ క్యాంపెయిన్‌ చేపట్టాలి.

* దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తిని పెంచాలి.

* బడ్జెట్‌లో కేటాయించిన రూ.35కోట్లు వెంటనే విడుదల చేయాలి.

* సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలి.

* లెక్కలోకి రాని ప్రైవేటు ట్రస్ట్‌ ఫండ్‌ను పీఎం కేర్‌ ద్వారా వ్యాక్సిన్‌, ఆక్సిజన్‌, ఔషధాల కొనుగోలుకు ఉపయోగించాలి.

* నిరుద్యోగులకు నెలకు రూ.6వేలు భృతి చెల్లించాలి.

* పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలు అందించాలి.

* కొవిడ్‌ పరిస్థితుల్లో రైతులను ఆదుకోలేకపోయిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని