‘డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేయాల్సిందే’

తాజా వార్తలు

Updated : 19/09/2020 13:14 IST

‘డిక్లరేషన్‌పై జగన్‌ సంతకం చేయాల్సిందే’

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ : అన్యమతస్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు డిక్లరేషన్‌ అవసరం లేదన్న తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌ కూడా డిక్లరేషన్‌పై సంతకం పెట్టాకే శ్రీవారిని దర్శించుకోవాలని సూచించారు. శనివారం దిల్లీలో రఘురామకృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ....వెంకన్నకు అన్యాయం చేసిన వాళ్లెవరూ బాగుపడిన దాఖలాలు లేవని హెచ్చరించారు. 

తిరుపతిలో ఆలయ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ బాండ్లలో తితిదే నిధులు ఇన్వెస్టు చేయడం సరికాదన్నారు.   దేవుడి సొమ్మును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ బాండ్లలో ఎలా పెడతారని ప్రశ్నించారు. తితిదే తీసుకుంటున్న నిర్ణయాలు సరిగాలేవని, దేవుడి సొమ్మును దోచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేశారు. తన మానసిక స్థితి సరిగా లేదన్నవారి మానసిక స్థితే సరిగాలేదని విమర్శించారు. తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని, తాను రాజ్యాంగాన్ని గౌరవిస్తానని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని