‘‘పథకాలకు జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది’’
close

తాజా వార్తలు

Published : 28/07/2020 01:35 IST

‘‘పథకాలకు జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది’’

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

దిల్లీ: రాష్ట్రంలో కరోనాపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు సూచించారు. ఇటీవల వైకాపాతో విభేదిస్తూ వస్తున్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం దిల్లీలో ఉంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో కరోనా పరిస్థితులపై స్పందించారు.

‘‘ప్రభుత్వం దృష్టికి ఎవరైనా సమస్యలు తీసుకొస్తే పరిష్కరించాలి. కరోనాపై చర్యలు తీసుకోవాలి. పథకాలన్నింటికీ జగన్‌ పేరు పెట్టుకోవడం అలవాటైంది. అలాగే జగనన్న కరోనా కేర్‌ అనో ఏ పేరైనా పెట్టుకోండి. కానీ ప్రజలకు ప్రయోజనం చేకూర్చేలా చర్యలు తీసుకోవాలి. కులాలకు అతీతంగా జగనన్న కరోనా కంట్రోల్‌లో సభ్యులు ఉండాలి’’అని ఎంపీ అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని