Rahul Gandhi: చైనా ఆక్రమణలు.. ప్రధాని మోదీపై రాహుల్‌ సెటైర్‌!

తాజా వార్తలు

Updated : 04/10/2021 05:30 IST

Rahul Gandhi: చైనా ఆక్రమణలు.. ప్రధాని మోదీపై రాహుల్‌ సెటైర్‌!

దిల్లీ: తూర్పు లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను పెంచుతున్న వేళ ప్రధాని మోదీపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓ ర్యాలీలో మోదీ చేసి ‘56 అంగుళాల ఛాతీ’ వ్యాఖ్యను రాహుల్‌ గాంధీ ఈసందర్భంగా ఉటంకిస్తూ విమర్శలు చేశారు. లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో చైనా బలగాల చొరబాటును ప్రస్తావిస్తూ.. ‘చైనా+పాకిస్థాన్‌+మిస్టర్‌ 56 అంగుళాలు కలిస్తే భారత భూభాగంలో చైనా ఆక్రమణలు’ అంటూ రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

భారత భూభాగంలో చైనా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌లోని భారత సరిహద్దుల్లోకి చైనా బలగాలు చొచ్చుకువచ్చాయని పలు నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో చైనా తమ బలగాలను నానాటికీ పెంచుతోందని, మౌలిక సదుపాయాలను కూడా మెరుగుపర్చుకుంటోందని భారత సైనిక దళాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె వ్యాఖ్యలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత సైన్యం సంసిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం లద్దాఖ్‌ వెళ్లిన ఆయన అక్కడి ఫార్వర్డ్ శిబిరాలను పరిశీలించారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ తూర్పు లద్దాఖ్‌లో  భారత సైన్యం అధునాతన ఆయుధాలను మోహరిస్తోంది. ఇందులో భాగంగానే లద్దాఖ్‌లోని ఫార్వర్డ్‌ ఏరియాల్లో తొలిసారిగా కే9 - వజ్ర శతఘ్నులను మోహరించింది. స్వీయ చోదక సామర్థ్యం గల ఈ కే9 - వజ్ర శతఘ్నులు.. 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రు స్థావరాలపై విరుచుకుపడి ధ్వంసం చేయగలవు. ఈ హోవిట్జర్‌లతో కూడిన మొత్తం రెజిమెంట్‌ను వాస్తవాధీన రేఖ వెంబడి లద్దాఖ్‌ సెక్టార్‌లో మోహరించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని