కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తారా..?

తాజా వార్తలు

Updated : 13/06/2021 19:37 IST

కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో పెట్రో ధరలు తగ్గిస్తారా..?

రాహుల్‌ను ప్రశ్నించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ 

దిల్లీ: ఇంధన ధరల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్‌ మండిపడ్డారు. పెట్రో ధరల పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న సామాన్య ప్రజల గురించి జాలి ఉంటే..  ధరలు తగ్గించాలంటూ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు ఆదేశాలివ్వాలని రాహుల్‌కు సవాలు విసిరారు. అయితే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఆ విధంగా చేస్తారా..లేదా.. అనే విషయంపై ఆయన మాట్లాడలేదు. ‘‘ఇంధనం ధరలు పెరిగిన మాట వాస్తవమే. అయితే పేద ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించడం కోసం కేంద్రం ఈ ఏడాది రూ. లక్ష కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. మరోవైపు కొవిడ్‌ కట్టడిలో భాగంగా వ్యాక్సిన్లు, ఆరోగ్యపరమైన మౌలిక సదుపాయాల కోసం కూడా రూ.కోట్లు వెచ్చిస్తోందన్నారు. పెట్రో ధరల పెంపు నేపథ్యంలో పదే పదే ప్రధాని మోదీపై విమర్శలు చేస్తున్న రాహుల్‌.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలైన మహారాష్ట్ర, రాజస్థాన్‌, పంజాబ్‌లలో అధిక ధరలు ఎందుకున్నాయో చెప్పాలన్నారు. స్థానికంగా పన్నులు తగ్గించాల్సిందిగా ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరాలని సూచించారు. 

గతేడాది చమురు ధరలు అంతర్జాతీయంగా పదేళ్ల కనిష్ఠానికి పడిపోయినప్పుడు దానికి అనుగుణంగా వినియోగదారులకు లబ్ధి చేకూర్చాల్సిందిపోయి.. ఎక్సైజ్‌ డ్యూటీని కేంద్ర సర్కారు అమాంతం పెంచేసింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని పదవిని చేపట్టిన సమయంలో ఎక్సైజ్‌ డ్యూటీ లీటరు పెట్రోలుపై రూ.9.48, లీటరు డీజిల్‌పై రూ.3.56 ఉంది. ప్రస్తుతం ఎక్సైజ్‌ డ్యూటీ లీటరు పెట్రోలుపై రూ.32.90, లీటరు డీజిల్‌పై రూ.31.80గా ఉంది.  ఈ ఏడాది మే 4 నుంచి 23 సార్లు ఇంధనం ధరలు పెరిగాయి. ఈ కాలంలో లీటరు పెట్రోలు ధర రూ.5.72, డీజిల్‌ ధర రూ.6.25 మేర పెరిగింది.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని