షా సమక్షంలో భాజపాలోకి టీఎంసీ నేతలు

తాజా వార్తలు

Published : 31/01/2021 01:21 IST

షా సమక్షంలో భాజపాలోకి టీఎంసీ నేతలు

దిల్లీ: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఐదుగురు కీలక నేతలు శనివారం దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో భాజపాలో చేరారు. మాజీ మంత్రి రజిబ్‌ బెనర్జీ సహా, వైశాలీ దాల్మియా, ప్రబిర్‌ ఘోషాల్‌, రతిన్‌ చక్రవర్తి, రుద్రానిల్‌ ఘోష్‌ భాజపా తీర్థం పుచ్చుకున్నారు. ఈ విషయాన్ని అమిత్‌షా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. వీరి చేరిక ‘సోనార్‌ బంగ్లా’ సాకారం కోసం భాజపా చేస్తున్న పోరాటాన్ని మరింత బలపరుస్తుందని పేర్కొన్నారు.  శనివారం సాయంత్రం ప్రత్యేక విమానంలో కోల్‌కతా నుంచి దిల్లీకి చేరుకున్న వీరంతా ముందుగా అమిత్‌షాతో భేటీ అయ్యారు. అనంతరం పార్టీలో చేరారు.

తొలుత ఈ ఐదుగురు నేతలు ఆదివారం జరగబోయే అమిత్‌షా సమావేశంలో భాజపాలో చేరాల్సి ఉన్నప్పటికీ.. షా బెంగాల్‌ పర్యటన రద్దు కావడంతో శనివారం దిల్లీకి వెళ్లాల్సి వచ్చింది. కాగా ఆదివారం హౌరాలో జరగనున్న బహిరంగ సభలో అమిత్‌షా వర్చువల్‌గా పాల్గొననున్నారు. 

ఇదీ చదవండి

దిల్లీ పేలుడు ఆ ఉగ్రవాదుల పనేనా?Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని