తెతెదేపా అధ్యక్ష పదవికి ఎల్‌ రమణ రాజీనామా

తాజా వార్తలు

Updated : 09/07/2021 14:47 IST

తెతెదేపా అధ్యక్ష పదవికి ఎల్‌ రమణ రాజీనామా

హైదరాబాద్‌: తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌ రమణ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమణ తెలిపారు. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతోనే తెరాసలో చేరుతున్నట్లు ఆయన వెల్లడించారు. 30 ఏళ్లుగా తన ఎదుగుదలకు తోడ్పడిన చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి రమణ ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. తగిన గుర్తింపు ఇస్తామని, రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని సీఎం ఆయనకు హామీ ఇచ్చారు. దీంతో తెరాసలో చేరేందుకు రమణ అంగీకరించారు. మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ సమక్షంలో ఆయన చేరనున్నట్లు సమాచారం.. నెల రోజులుగా రమణతో సంప్రదింపులు జరుగుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి చొరవ తీసుకొని సీఎంతో భేటీకి నిర్ణయించారు. ఆయన నుంచి పిలుపురావడంతో రమణ గురువారం ఎర్రబెల్లి ఇంటికి వచ్చారు. ఎమ్మెల్యే టికెట్‌, పార్టీలో కీలక పదవుల గురించి మాట్లాడినట్లు తెలిసింది. తర్వాత ప్రగతిభవన్‌కు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, విపక్షాల పరిస్థితి, చేనేత సంక్షేమ కార్యక్రమాలు, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల గురించి చర్చించారు. తెరాసలో చేరి బీసీల అభ్యున్నతిలో భాగస్వామి కావాలని కేసీఆర్‌ సూచించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని