జనసేన ఎమ్మెల్యే రాపాక తీవ్ర వ్యాఖ్యలు..

తాజా వార్తలు

Published : 12/08/2020 02:13 IST

జనసేన ఎమ్మెల్యే రాపాక తీవ్ర వ్యాఖ్యలు..

అమరావతి: జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌ సొంత పార్టీపైనే  తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను గెలిచిన జనసేన పార్టీ బలపడేది కాదన్నారు. ఏదో గాలివాటంగా తాను ఒక్కడినే గెలిచానని వ్యాఖ్యానించారు.  గత కొన్నాళ్లుగా రాపాక వరప్రసాద్‌ వైకాపా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తూ.. వారికి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో జనసేన అధిష్ఠానం రాపాకపై అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో రాపాక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.  

‘‘గత ఎన్నికల్లో వైకాపా నుంచి టిక్కెట్‌ కోసం ప్రయత్నించా. ఈ మేరకు జగన్‌, సుబ్బారెడ్డితోనూ మాట్లాడా. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వేరేవాళ్లకు టిక్కెట్‌ ఇచ్చారు. జనసేన నుంచి నేను సొంత బలంతో ఎమ్మెల్యేగా గెలిచా. అసెంబ్లీకి వెళ్లగానే సీఎం జగన్‌ను కలిశా. సీఎంతో కలిసి వైకాపాలోనే పనిచేస్తున్నా. ప్రస్తుతం రాజోలు నియోజకవర్గ వైకాపాలో మూడు వర్గాలు ఉన్నాయి. వర్గాలు పార్టీకి మంచివి కావు. వర్గాలు పోవాలంటే సీఎం ఒక నిర్ణయం తీసుకోవాలి’’అని రాపాక తెలిపారు. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని