AP News: ‘సుద్దులొద్దు సీఎం గారూ.. ఆచరించి చూపండి’

తాజా వార్తలు

Published : 23/10/2021 01:16 IST

AP News: ‘సుద్దులొద్దు సీఎం గారూ.. ఆచరించి చూపండి’

అమరావతి: ప్రతిపక్షంలో ఉండగా అప్పటి సీఎం చంద్రబాబును దుర్భాషలాడిన జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చాక నీతులు చెబుతున్నారని రాయలసీమ తెదేపా నేతలు మండిపడ్డారు. తెదేపా అధినేత చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైకాపా నేత సెంథిల్‌ కుమార్‌, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అరెస్టు చేసి సీఎం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఏదో తప్పు మాట్లాడారని ఇంత రాద్ధాంతం చేస్తున్నారే.. మరి రఘురామిరెడ్డిని ఏం చేస్తారు? రెస్కో ఛైర్మన్‌పై ఏయే సెక్షన్ల కింద కేసులు పెట్టి మీరు అరెస్టు చేస్తారు? వారిపై నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెట్టి ఈరోజో, రేపో వాళ్లను అరెస్టు చేసి ప్రజలకు ఆదర్శనీయంగా నిలవండి.. మంచి రాజకీయాలు అక్కడి నుంచి మొదలుపెడదాం. నీతులు చెప్పడం మానుకోండి.. బాంబులేస్తే భయపడేవారు లేరు. మేం కూడా రాయలసీమ నుంచి వచ్చినవాళ్లమే’’ అని వ్యాఖ్యానించారు.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని