విశాఖ ఉక్కుపై రాజీనామాలే అస్ర్తం:గంటా

తాజా వార్తలు

Published : 10/03/2021 13:59 IST

విశాఖ ఉక్కుపై రాజీనామాలే అస్ర్తం:గంటా

విశాఖ: విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు రాజీనామాలే అస్ర్తమని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ను వందశాతం ప్రైవేటీకరణ చేస్తామని కేంద్రం ప్రకటించినా రాజీనామాలపై అధికార పార్టీ నేతలు ఇంకా ఆలోచించడాన్ని ఆయన తప్పుబట్టారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..గతంలో జగన్‌ ప్రత్యేక హోదా విషయంలో తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించారని గుర్తు చేశారు. రాజీనామాల వల్ల ఉపయోగం లేకపోతే ఆనాడు రాజీనామాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ప్రస్తుతం ఉక్కు పరిశ్రమను కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ఏర్పడిందన్నారు. ఎంపీలు, మంత్రులు రాజీనామాలు చేసి ఉక్కు ఉద్యమంలో పాల్గొనాలన్నారు. అప్పుడే కేంద్ర ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తుందని పేర్కొన్నారు. 

రాజీనామా అనేది బలమైన ఆయుధం అని గంటా శ్రీనివాసరావు అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాటం చేయాలని సూచించారు. సీఎం జగన్‌ గట్టి నిర్ణయం తీసుకొని ఉద్యమాన్ని ముందుకు నడపాలని డిమాండ్‌ చేశారు. విశాఖలోని కూర్మన్నపాలెం వద్ద 36 గంటల పాటు జాతీయ రహదారిని దిగ్బంధించిన ఉద్యమకారులు కార్పొరేషన్‌ ఎన్నికల దృష్ట్యా నిరసనలను ఈ ఒక్క రోజు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఉక్కు ఉద్యమాన్ని ఉద్ధృతం చేయడానికి విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటనకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం కూడలిలో 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని