UP elections: ఎస్పీ- ఆప్‌ కలిసి పోటీ..?

తాజా వార్తలు

Published : 03/07/2021 16:41 IST

UP elections: ఎస్పీ- ఆప్‌ కలిసి పోటీ..?

లఖ్‌నవూ: వచ్చే ఏడాది జరగబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ కలిసి పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ను ఆప్‌ రాష్ట్ర ఇన్‌ఛార్జి సంజయ్‌ సింగ్‌ శనివారం భేటీ కావడంతో ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాబోయే ఎన్నికల్లో చిన్న పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళతామని అఖిలేశ్‌ ఇది వరకే ప్రకటించారు. దీనికితోడు ఇటీవల రామమందిర భూ కొనుగోళ్ల వ్యవహారంలో రెండు పార్టీలు ఒకే రీతిన విమర్శలు చేశాయి. ఈ క్రమంలో ఇరు పార్టీ నేతలు భేటీ కావడంతో కలిసి పోటీ చేసే అంశంపైనే భేటీ అయ్యుండొచ్చని భావిస్తున్నారు.

అయితే, అఖిలేశ్‌ను మర్యాదపూర్వకంగానే కలిశానని సంజయ్‌సింగ్‌ భేటీ అనంతరం మీడియాతో అన్నారు. అఖిలేశ్‌ పుట్టినరోజు రోజున (జులై 1న) కలవలేకపోయానని, శుభాకాంక్షలు తెలిపేందుకే భేటీ అయ్యానని వివరించారు. మరోవైపు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసిన సమాజ్‌వాదీ పార్టీ ఘోరంగా దెబ్బతింది. దీంతో ఈ సారి కాంగ్రెస్‌తో గానీ, బీఎస్పీతో గానీ కలిసి పోటీ చేసే ఆలోచన లేదని ఇది వరకే అఖిలేశ్‌ యాదవ్‌ తేల్చి చెప్పారు. బీఎస్పీ సైతం తాము ఒంటరిగానే వెళ్తామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని