AP News: తెదేపా కార్యాలయాలపై దాడులకు సాక్ష్యాలివిగో..: సోమిరెడ్డి

తాజా వార్తలు

Published : 22/10/2021 18:30 IST

AP News: తెదేపా కార్యాలయాలపై దాడులకు సాక్ష్యాలివిగో..: సోమిరెడ్డి

అమరావతి: ఏపీలో బాధితులను ముద్దాయిలుగా మార్చేస్తున్నారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి విమర్శించారు. ఇలాంటివి ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ చూడలేదన్నారు. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన ఆధారాలను ఆయన మీడియాకు విడుదల చేశారు. తెదేపా కార్యాలయంపై దాడి చేసిన నిందితుల ఫొటోలను, ఓ డీఎస్పీ దగ్గరుండి నిందితులను సాగనంపారంటూ వీడియోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజలపై హింసను పోలీసులే ప్రోత్సహిస్తూ.. బాధితులను ముద్దాయిలుగా మారుస్తున్నారు. ప్రశాంతంగా బంద్‌కు పిలుపునిస్తే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాష్ట్రంలో పోలీసుల తీరు చూస్తుంటే బాధేస్తోంది’’ అని అన్నారు.

‘‘మా ఫిర్యాదుపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. దాడికి పాల్పడిన వారిని డీఎస్పీ దగ్గర ఉండి కారెక్కించి పంపారు. దాడులు, అప్పులు తప్ప జగన్‌కు ఏమీ తెలియదు. రాష్ట్రంలో హింస పెట్రేగిపోయింది. ప్రభుత్వం పోలీసులను పెట్టుకొని ప్రజలపై దాడి చేస్తోంది. రాష్ట్రంలో గంజాయి, మత్తుపదార్థాలు పెరిగిపోయాయి.. అరికట్టాలని అడిగితే దాడులు చేసే పరిస్థితి వచ్చేసింది. రాష్ట్ర పోలీస్‌ వ్యవస్థని బిహార్‌, బెంగాల్‌ కన్నా దిగజార్చారు. రాష్ట్రం ఎక్కడికి పోతోందో అర్థంకావడంలేదు’’ అని సోమిరెడ్డి మండిపడ్డారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని