మారటోరియంపై డిమాండ్‌ చేద్దాం: రాష్ట్రాలకు స్టాలిన్‌ లేఖ

తాజా వార్తలు

Published : 09/06/2021 01:33 IST

మారటోరియంపై డిమాండ్‌ చేద్దాం: రాష్ట్రాలకు స్టాలిన్‌ లేఖ

చెన్నై: వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రమే చేపట్టేలా ఒత్తిడి తేవాలంటూ కేరళ, ఏపీ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇతర రాష్ట్రాలకు పరస్పరం లేఖలు రాసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సార్వత్రిక టీకా కార్యక్రమంపై ప్రకటన చేశారు. దేశంలో వ్యాక్సినేషన్‌ బాధ్యతను కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. రాష్ట్రాలు టీకాల కోసం రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. దీంతో రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ కొనుగోలు చేసే భారం తప్పింది. రాష్ట్రాల డిమాండ్‌ నెరవేర్చినట్లయింది. అయితే, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ కొత్తగా మరో అంశాన్ని లేవనెత్తారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పరిశ్రమల రుణాలపై మారటోరియం ప్రకటించాలనే తన డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరుతూ 12 రాష్ట్రాలకు లేఖ రాశారు.

‘‘మనం ఐక్యంగా కృషి చేయడం వల్లే కేంద్రం వ్యాక్సినేషన్‌ పాలసీని మార్చుకుంది. అలాగే ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల రుణాలపై మారటోరియం ఇవ్వాలని కోరుదాం. కరోనా మొదటి వేవ్‌ సమయంలో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరించిన తీరులో, ప్రస్తుత రెండో వేవ్‌లో రుణగ్రహీతల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరులో అసమానతలున్నాయి. రెండో వేవ్‌ లాక్‌డౌన్‌లో కేంద్రం ఆర్థిక ఉద్దీపన పథకాలేవి ప్రకటించలేదు. అందుకే రూ. 5కోట్ల వరకు రుణాలున్న పరిశ్రమలకు ఊరట కల్పించాలని కోరుతూ ముఖ్యమంత్రులంతా కేంద్ర ఆర్థిక మంత్రికి, రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌కు లేఖలు రాయాలని విజ్ఞప్తి చేస్తున్నా’’అని స్టాలిన్‌ లేఖలో పేర్కొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని