Lokesh:ఉక్కును తుక్కు ధ‌ర‌కు కొట్టేయాల‌ని కుట్ర‌

తాజా వార్తలు

Updated : 22/05/2021 13:48 IST

Lokesh:ఉక్కును తుక్కు ధ‌ర‌కు కొట్టేయాల‌ని కుట్ర‌

అమ‌రావ‌తి: దొంగ తీర్మానాలు.. దిల్లీ పాద‌సేవ‌లు మానుకొని రాష్ట్ర ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో విశాఖ ఉక్కు ప్రైవేటీక‌ర‌ణకు వ్య‌తిరేకంగా పోరాడాల‌ని తెదేపా జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో వంద రోజులుగా పోరాటం చేస్తున్న ఉక్కు ప‌రిశ్ర‌మ కార్మికుల‌కు ఆయ‌న అభినంద‌న‌లు తెలిపారు. విశాఖ ఉక్కును తుక్కు ధ‌ర‌కు కొట్టేసి కార్మికుల ఊపిరి తీయాల‌ని జ‌గ‌న్ కుట్ర‌లు చేస్తున్నా.. ప్లాంట్ కార్మికులు ఆక్సిజ‌న్‌ను ఉత్పత్తి చేసి దేశ వ్యాప్తంగా క‌రోనా బాధితుల‌కు ప్రాణం పోస్తున్నార‌న్నారు. ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకునే వ‌ర‌కూ తెదేపా పోరాడుతూనే ఉంటుంద‌ని లోకేశ్ స్ప‌ష్టం చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని