‘‘దొంగ ఓట్లపై జగన్ సమాధానం చెప్పాలి’’

తాజా వార్తలు

Updated : 18/04/2021 12:23 IST

‘‘దొంగ ఓట్లపై జగన్ సమాధానం చెప్పాలి’’

తెదేపా సీనియర్‌ నేత యనమల

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దొంగ ఓట్లు- నోట్లు రాజ్యంగా చేశారని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. దొంగల పాలనలో రాష్ట్రం మొత్తం దొంగల మయమైందని ఆరోపించారు. దొంగ ఓట్ల అంశంపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నకిలీ ఓట్ల ముద్రణ మంత్రుల ప్రమేయంతో జరిగింది కాదా అని ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పోలింగ్‌ రోజు దొంగ ఓటర్లతో బస్సులు తిరుపతికి ఎలా వచ్చాయి?కేసులు నమోదైన 12 మంది అధికారులు వైకాపాకు చెందిన వారు కాదా?దొంగ ఓటర్లంతా మంత్రులు పంపిన వైకాపా వాళ్లు కాదా? నకిలీ ఓట్ల విషయాన్ని కాలవ శ్రీనివాసులు చెప్పినప్పుడే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు?వాళ్లందరిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?వెనక్కి పంపామని డీజీపీ చెప్పిన 250 బస్సులు ఎవరివి?ఆ బస్సుల్లో వచ్చిన వారంతా ఎవరు?144 సెక్షన్‌ విధిస్తే ఫంక్షన్‌ హళ్లలో, రోడ్లపై వేల మంది ఎలా చేరారు?ఓటమి భయంతోనే దొంగ ఓట్లు- దొంగ నోట్లతో జగన్ జిత్తులు. తెదేపా ఫిర్యాదులపై సీఈసీ వెంటనే స్పందించాలి. దీని వెనుక ఉన్న మంత్రులపై తక్షణమే కేసులు పెట్టాలి. దొంగ ఓట్లు ముద్రించిన వాళ్లపై ఐపీసీ కింద కఠిన చర్యలు చేపట్టాలి. తిరుపతి అసెంబ్లీ పరిధిలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలి’’ అని యనమల అన్నారు.

డీజీపీ స్వామిభక్తి చాటుకున్నారు: నిమ్మల

తిరుపతి ఉప ఎన్నిక వేళ నిన్న తిరుపతిలో కేంద్ర బలగాలున్నా.. మంత్రి పెద్దిరెడ్డి బలగాలు దౌర్జన్యాలకు దిగాయని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ‘‘కళాశాలలు, పాఠశాలల బస్సులను పెద్దిరెడ్డి ఎలా వాడారు?ఒక్కొక్కరికి 20 నకిలీ ఐడీలు ఇచ్చి దొంగ ఓట్లు వేశారు. డీజీపీ స్వామిభక్తిని చాటుకున్నారు, సమయమిస్తే సత్కరిస్తాం. దొంగ ఓటర్లను పట్టించిన తెదేపా ఏజెంట్లపై ఎదురు కేసులు పెట్టారు. తిరుపతి ఉప ఎన్నికకు రీపోలింగ్‌ నిర్వహించాలి. జగన్‌ ప్రభుత్వాన్ని గవర్నర్‌ బర్తరఫ్‌ చేయాలి’’ అని రామానాయుడు డిమాండ్‌ చేశారు. 

ప్రమాణానికి వైకాపా సిద్ధమా: పనబాక లక్ష్మి

‘‘తెదేపా రిగ్గింగ్‌కు పాల్పడిందని మంత్రి ఆరోపణలు చేశారు. ఇది అవాస్తమని నిజరూప దర్శనం రోజు తిరుమల శ్రీవారి ముందు ప్రమాణానికి సిద్ధం. వైకాపా నాయకులు ప్రమాణానికి సిద్ధమా?’’అని తెదేపా ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సవాల్‌ విసిరారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని