కేసీఆర్‌, జగన్‌ తోడు దొంగలే: కేశినేని నాని

తాజా వార్తలు

Updated : 01/07/2021 11:24 IST

కేసీఆర్‌, జగన్‌ తోడు దొంగలే: కేశినేని నాని

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌ ఇద్దరూ తోడు దొంగలేనని తెదేపా ఎంపీ కేశినేని నాని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఇరు రాష్ట్రాల మంత్రుల పరస్పర ఆరోపణల నేపథ్యంలో కేశినేని ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదం పెద్ద డ్రామా. ఎన్నికల ముందు, తర్వాత కేసీఆర్‌, జగన్‌ మధ్య పరస్పర సహకారం ఉంది. ప్రజలను ఆ ఇద్దరూ పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారు. హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకు కేసీఆర్‌తో కలిసి జగన్‌ డ్రామా ఆడుతున్నారు. ఏపీ ప్రజలు ఆ డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు కాదు’’ అని కేశినేని నాని అన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని