ఆ ముగ్గురివీ నాటకాలు: కేశినేని నాని

తాజా వార్తలు

Updated : 12/07/2021 04:05 IST

ఆ ముగ్గురివీ నాటకాలు: కేశినేని నాని

విజయవాడ: జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త ఆస్తి పన్ను విధానంతో పూరి గుడిసె ఉన్నవారు కూడా ఆస్తి పన్ను కట్టలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి ఏర్పడుతోందని తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. వైకాపా ప్రభుత్వం ఆస్తి పన్ను సహా ఇతర పన్నులు పెంచుతోందని కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలోనే చెప్పామని.. ప్రజలు తమ మాట వినలేదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని ప్రభుత్వం వేస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో 19వ డివిజన్‌ తెదేపా నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌తో కలిసి కేశినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి విజయవాడ అభివృద్ధికి రూ.480కోట్లు తెచ్చి కార్యక్రమాలు చేపట్టామని..  ఇప్పుడు నగరం మురికి కుంటలా తయారైందని విమర్శించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, జగన్‌ మధ్య సాన్నిహిత్యం ఉందని.. ఆ ఇద్దరూ ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు.  కేసీఆర్‌, జగన్, షర్మిల ముగ్గురూ ముగ్గురేనని.. వ్యాపారాల కోసం నాటకాలు ఆడుతున్నారని కేశినేని నాని వ్యాఖ్యానించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని