తిరుపతి పవిత్రతను కాపాడుతా : పనబాక

తాజా వార్తలు

Published : 07/04/2021 14:17 IST

తిరుపతి పవిత్రతను కాపాడుతా : పనబాక

తిరుపతి: ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీసిన భాజపాకి వత్తాసు పలుకుతున్న వైకాపాకు తిరుపతి పార్లమెంట్‌ ఓటర్లు తగిన బుద్ధి చెప్పాలని తిరుపతి లోక్‌సభ తెదేపా అభ్యర్థి పనబాక లక్ష్మి అన్నారు. తిరుపతిలోని తెదేపా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. 

21 మంది వైకాపా ఎంపీలు పార్లమెంట్‌లో ఏరోజైనా రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించారా అని నిలదీశారు. తిరుపతి ప్రచారంలో ప్రజలు తమ సమస్యలను ఏకరవు పెడుతున్నారన్నారు. గరుడవారధి, గూడూరు ఫ్లైఓవర్‌, నడికుడి రైల్వేలైన్‌ ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అసంపూర్తిగానే ఉన్నాయన్నారు. నాలుగు పర్యాయాలు ఎంపీగా, రెండు సార్లు కేంద్రమంత్రిగా పని చేసిన తనకు మరో అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఎంపీగా అవకాశం కల్పిస్తే తిరుపతి పవిత్రతను కాపాడేందుకు కృషి చేస్తానని పనబాక విజ్ఞప్తి చేశారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని