Ts Politics: బల్మూర్ వెంకట్‌ను పరామర్శించిన మధుయాష్కీ గౌడ్

తాజా వార్తలు

Updated : 23/07/2021 22:38 IST

Ts Politics: బల్మూర్ వెంకట్‌ను పరామర్శించిన మధుయాష్కీ గౌడ్

హైదరాబాద్‌: పోలీసుల లాఠీచార్జిలో గాయపడ్డ ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్‌ను టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఫోన్లను హ్యాక్‌ చేస్తోందంటూ వస్తున్న ఆరోపణల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఇందిరా పార్కు వద్ద నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మధుయాష్కీ మాట్లాడుతూ.. బల్మూర్ వెంకట్‌ను పోలీసులు కావాలనే టార్గెట్ చేసి పిడిగుద్దులు గుద్దుతూ పక్కటెముకలు విరిగేలా కొట్టారని ఆరోపించారు. అరెస్టు చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇలా చేయడం దారుణన్నారు. ఈ ఘటనపై మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. వెంకట్‌పై దాడి చేసిన పోలీసు సిబ్బందిపై డీజీపీ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ లీగల్ సెల్‌ను సంప్రదించి ఈ ఘటనపై సరైన విధంగా స్పందిస్తామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని