Ap news: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి.. సామగ్రి ధ్వంసం

తాజా వార్తలు

Updated : 19/10/2021 18:25 IST

Ap news: తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి.. సామగ్రి ధ్వంసం

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై దాడి చేశారు. విజయవాడలోని ఆయన ఇంట్లో గుర్తు తెలియని దుండగులు సామగ్రి ధ్వంసం చేశారు. ఇవాళ ఉదయం పట్టాభి నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రభుత్వాన్ని ఉద్దేశించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుకు విశాఖ నర్సీపట్నం పోలీసుల నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబడుతూ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశంలో ఆయన వాడిన భాషను వ్యతిరేకిస్తూ కొందరు దుండగులు పలు ప్రాంతాల్లో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే హిందూపురం, విశాఖపట్నంలో వైకాపా కార్యకర్తలు, నేతలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పార్టీ వర్గాలకు సమాచారం అందుతోంది. దీనిలో భాగంగానే విజయవాడలో ఉన్న పట్టాభి నివాసంలోనూ అరగంట క్రితం కొందరు దుండగులు దాడి చేశారు. పట్టాభి ప్రస్తుతం పార్టీ కార్యాలయంలో ఉన్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపైనా దాడి జరిగినట్లు తెలుస్తోంది.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని