Badvel By Election:: బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారు

తాజా వార్తలు

Updated : 07/10/2021 10:09 IST

Badvel By Election:: బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారు

బద్వేలు: కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక భాజపా అభ్యర్థి ఖరారయ్యారు. తమ పార్టీ తరఫున పనతల సురేష్‌ పోటీ చేయనున్నట్లు ఏపీ భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు. సురేష్‌ను అదిష్ఠానం ఎంపిక చేసినట్లు ఆయన ఓ ప్రకటనలో చెప్పారు. దివంగత ఎమ్మెల్యే డా.వెంకటసుబ్బయ్య ఆకస్మిక మరణంతో బద్వేలు ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికార పార్టీ తరఫున వెంకటసుబ్బయ్య భార్య సుధ బరిలో ఉన్నారు. ఇక్కడ ఈ నెల 30న పోలింగ్, వచ్చే నెల 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెదేపా, జనసేన ఉప ఎన్నికకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని