Bandi Sanjay: రాష్ట్రంలో బీసీ బంధు అమలు చేయాలి: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

తాజా వార్తలు

Updated : 26/09/2021 11:49 IST

Bandi Sanjay: రాష్ట్రంలో బీసీ బంధు అమలు చేయాలి: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌: రాష్ట్రంలో బీసీ బంధు అమలు చేయాలని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బీసీల సమస్యలపై సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. అర్హులైన ప్రతి బీసీ కుటుంబానికి రూ.10లక్షల సాయం అందించాలని కోరారు. జనాభాలో 50శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.

‘‘తెరాస ప్రభుత్వ పాలనలో బీసీ సబ్‌ప్లాన్‌ అటకెక్కింది. 46 బీసీ కులాలకు నిర్మిస్తామన్న ఆత్మ గౌరవ భవనాల అడ్రస్‌ ఎక్కడ?చేనేత కార్మికులకు బీమా, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలి. గీత కార్మికులను ఆదుకోవడంతో పాటు రజకులకు దోబీ ఘాట్‌లు నిర్మించాలి. నాయీ బ్రహ్మణులకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వాలి. ఎంబీసీ కార్పొరేషన్‌కు సమృద్ధిగా నిధులు కేటాయించాలి. రూ.3,400 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలి’’ అని సంజయ్‌ లేఖలో పేర్కొన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని