pawan kalyan: బీసీల ఉద్యమానికి మద్దతిచ్చేందుకు సిద్ధం: పవన్‌ కల్యాణ్‌

తాజా వార్తలు

Updated : 12/10/2021 18:51 IST

pawan kalyan: బీసీల ఉద్యమానికి మద్దతిచ్చేందుకు సిద్ధం: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: వెనుకబడిన తరగతుల వారి హక్కుల కోసం ఉద్యమించే సమయంలో అంతా ఏకమవుతున్నారనీ, ఎన్నికల సమయానికి మాత్రం విడిపోతున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. బీసీల ఉద్యమానికి మద్దతు ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. 2024 ఎన్నిల సమయానికి బీసీలు స్పష్టమైన అజెండాతో ఉండాలన్నారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి చెందిన పలువురు నాయకులు పవన్‌ కల్యాణ్‌ని కలిశారు. ఈనెల 23న హైదరాబాద్‌లో నిర్వహించే బీసీ సంక్షేమ సంఘం జాతీయ స్థాయి సదస్సుకు పవన్‌ను ఆహ్వానించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి కులగణన, రిజర్వేషన్ల కల్పనలో తమకు జరుగుతున్న అన్యాయాన్ని వారు వివరించారు.

ఈ సందర్భంగా  పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ.. బీసీ సంఘాలు చేస్తున్న ఉద్యమం తాలూకు భావ వ్యాప్తికి తాను కట్టబడి ఉన్నానని స్పష్టం చేశారు. అధికారానికి దూరంగా ఉన్న కులాల కోసం పని చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ కులాలకు స్వయం ప్రతిపత్తి, రాజ్యాధికారం తీసుకురావాలన్నదే తన ఆకాంక్షగా పవన్‌ పేర్కొన్నారు. బీసీల హక్కుల సాధన కోసం చేస్తున్న ఉద్యమం భావ వ్యాప్తిని ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇందుకోసం తగిన మథనం జరగాలన్నారు. యువతకు నాయకత్వాన్ని అప్పగించాలని, రాజకీయంగా ముందుకెళ్లాలని పేర్కొన్నారు. బీసీ ఉద్యమానికి మద్దతుగా తన వంతుగా ప్రతి వేదిక మీద మాట్లాడతానని పవన్‌ అన్నారు. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్‌రెడ్డి, తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్‌గౌడ్‌, పొలిట్‌ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్‌, పార్టీ నాయకులు ప్రజీత్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని