TS News: ఏడేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారు?: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

తాజా వార్తలు

Updated : 29/09/2021 14:43 IST

TS News: ఏడేళ్లలో ఎన్ని డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించారు?: కేసీఆర్‌కు బండి సంజయ్‌ లేఖ

హైదరాబాద్‌: తెరాస అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో రెండు పడక గదుల ఇళ్లు ఎన్ని నిర్మించారని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. అందులో పేదలకు ఎన్ని ఇళ్లు ఇచ్చారో లెక్కలు చెప్పగలరా అని సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2018 ఎన్నికల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల హామీని అందులో ప్రస్తావించారు. సొంత స్థలం ఉన్న అర్హులైన పేదలకు ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల ఆర్థికసాయం మాట ఏమైందని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక్కరైనా లబ్ధిదారులు ఉన్నారా ?అని లేఖలో నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం 2 లక్షల91 వేల ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసిందని.. అందులో ఎన్ని ఇళ్లు పూర్తి చేశారో చెప్పాలని కోరారు. గజ్వేల్‌, సిరిసిల్లా, సిద్దిపేట నియోజకవర్గాల్లో ఎన్ని రెండు పడక గదులు ఇళ్లు నిర్మించారు.. మిగతా నియోజకవర్గాల్లో ఎన్ని పూర్తి చేశారని సీఎంకు రాసిన లేఖలో బండి సంజయ్‌ ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని