Chandrababu: ఆ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు

తాజా వార్తలు

Published : 09/10/2021 02:07 IST

Chandrababu: ఆ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తేనే ఏపీ అభివృద్ధి: చంద్రబాబు

అమరావతి: రెండేళ్లలో వైకాపా ప్రభుత్వం అంత అప్రదిష్టపాలైన సర్కారు ఎక్కడా లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపాది విధ్వంసం, అవినీతి, ఉన్మాద పాలన అన్న చంద్రబాబు .. ఆ పార్టీని శాశ్వతంగా సమాధి చేస్తే తప్ప ఏపీ అభివృద్ధి చెందదని అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీని బిహార్‌ మాదిరిగా మార్చే పరిస్థితికి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అమరావతిని కొనసాగిస్తే రూ.2లక్షల కోట్ల ఆస్తి వచ్చేదన్నారు. గొడవలుపడి మన నీటిహక్కును కేంద్రానికి అప్పగించారని విమర్శించారు.

నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగం 

తెదేపా ప్రభుత్వ హయాంలో నీరు-చెట్టు పథకంలో భాగంగా పనులు చేసిన కాంట్రాక్టర్లకు చివరి రూపాయి చెల్లించే వరకూ కృషి చేస్తామని  చంద్రబాబు హామీ ఇచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నీరు-చెట్టు పెండింగ్‌ బిల్లుల ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించారు. 1,277 కోట్ల రూపాయల పనులకు సంబంధించిన బిల్లులు సీఎఫ్‌ఎంఎస్‌లో టోకెన్‌పడి పెండింగ్‌లో ఉన్నవాటితో పాటు మంజూరు కావాల్సినవి మరో రూ.500కోట్ల వరకు ఉన్నాయన్నారు. చిన్న నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, అటవీశాఖల్ని సమన్వయం చేసుకుంటూ దేశంలోనే తొలిసారి నీరు-ప్రగతి కింద రూ.18,265 కోట్లు వెచ్చించి నీటి సంరక్షణ చర్యలు చేపట్టామని వివరించారు.  98 కోట్ల ఘనపు మీటర్ల  పూడిక మట్టిని తొలగించి, 90 టీఎంసీల భూగర్భ జలాలు పెంపొందించి 6.79లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థిరీకరించామన్నారు. ఇందుకు 9 మెరిట్‌ స్కాచ్‌ అవార్డులు రాష్ట్ర ప్రభుత్వానికి దక్కాయని తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కక్షపూరితంగా పనులు నిలిపివేసి నీటి సంఘాల ప్రతినిధులు, చిన్న రైతులు రోడ్డున పడేలా చేసిందని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర యాదవ్‌, మాజీ మంత్రి దేవినేని ఉమా, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యేలు కూనా రవికుమార్‌, బీసీ జనార్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని