hyderabad news: భోలక్‌పూర్‌లో తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

తాజా వార్తలు

Updated : 27/07/2021 16:33 IST

hyderabad news: భోలక్‌పూర్‌లో తెరాస, భాజపా కార్యకర్తల బాహాబాహీ

హైదరాబాద్‌: ముషీరాబాద్‌లో తెరాస, భాజపా నేతల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బోనాల పండుగ నిర్వహణ చెక్కుల పంపిణీలో వివాదం తలెత్తింది. భోలక్‌పూర్‌లోని భవానీశంకర్‌గుడిలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ చెక్కులు పంపిణీ చేశారు. భాజపా కార్పొరేటర్లకు చెప్పకుండానే చెక్కులు పంపిణీ చేశారని వివాదం తలెత్తింది. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోగానే తెరాస, భాజపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు వాగ్వాదానికి దిగాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను అదుపు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని