AP News: రేణిగుంటలో రణరంగం... తెదేపా, వైకాపా నేతల ఘర్షణ

తాజా వార్తలు

Updated : 19/10/2021 17:52 IST

AP News: రేణిగుంటలో రణరంగం... తెదేపా, వైకాపా నేతల ఘర్షణ

తిరుపతి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం పరిధిలోని రేణిగుంటలో పెరిగిన విద్యుత్‌  ఛార్జీలకు నిరసనగా తెలుగుదేశం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. తెదేపా నేత బొజ్జల సుధీర్‌రెడ్డి, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి నరసింహయాదవ్‌ ఆధ్వర్యంలో రేణిగుంట అంబేడ్కర్‌ విగ్రహం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు ఆపార్టీ నేతలు నిరసన ర్యాలీ చేపట్టారు. 

ఈ ర్యాలీని రేణిగుంట సర్పంచి నగేశ్‌, ఉప సర్పంచి సుజాత, వైకాపా శ్రేణులు అడ్డుకున్నారు. ఈక్రమంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం రాళ్లతో దాడి చేసుకున్నారు. తెదేపా నేతలపై చెప్పులు, చీపుర్లతో వైకాపా నేతలు దాడి చేశారు. పోలీస్‌స్టేషన్‌కు సమీపంలోనే ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. ర్యాలీ ముగించుకుని తెదేపా నేతలు కారులో వెళ్తున్న సమయంలో సుధీర్‌రెడ్డి, నరసింహయాదవ్‌, తెదేపా నేతల వాహనాలపై వైకాపా శ్రేణులు మరోసారి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈఘటనలో కార్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అప్రజాస్వామిక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన తమపై దాడులకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ తెదేపా నేతలు తిరుపతి అర్బన్‌ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు బయల్దేరారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని