AP News: అవగాహనలేమితోనే సంగం డెయిరీపై విమర్శలు : ధూళిపాళ్ల

తాజా వార్తలు

Updated : 24/07/2021 11:33 IST

AP News: అవగాహనలేమితోనే సంగం డెయిరీపై విమర్శలు : ధూళిపాళ్ల

అమరావతి: గుంటూరు జిల్లా వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సంగం డెయిరీపై చేసిన విమర్శలపై సంస్థ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర ఘాటుగా స్పందించారు. గతంలో డెయిరీ నిర్వహించిన బ్రహ్మనాయుడు సంగం డెయిరీని విమర్శించటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. పాడి రైతులకు ఇచ్చే బోనస్, ఇతర ప్రోత్సాహకాల గురించి కనీస అవగాహన లేకుండా ఆయన మాట్లాడారని మండిపడ్డారు. పదవితోనూ వ్యాపారం చేయొచ్చని బ్రహ్మనాయుడు నిరూపించారని చెప్పారు.

పేదలకు ఇళ్ల స్థలాల పేరిట ఎమ్మెల్యే తనకున్న పనికి రాని భూమిని ప్రభుత్వానికి రూ. 18 కోట్లకు విక్రయించారని ఆరోపించారు. అదే డబ్బుతో సమీపంలో భూములు కొన్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వినుకొండ బైపాస్ రోడ్డును ఎమ్మెల్యే తన పొలాల సమీపానికి మళ్లించారని ధూళిపాళ్ల విమర్శించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని