AP News: టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పోటీ చేయడం ఖాయం: మాజీ మంత్రి డీఎల్‌

తాజా వార్తలు

Published : 16/10/2021 01:49 IST

AP News: టికెట్‌ ఇచ్చినా.. ఇవ్వకపోయినా పోటీ చేయడం ఖాయం: మాజీ మంత్రి డీఎల్‌

కడప: సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ టికెట్‌ ఇచ్చినా .. ఇవ్వకపోయినా పోటీచేయడం మాత్రం ఖాయమన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఘాటుగా స్పందించారు. 

‘‘2024 ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తా. ఏపార్టీ తరఫున పోటీ చేస్తాననేది ఇప్పుడే చెప్పలేను. ప్రతిభ ఆధారంగానే పార్టీ టికెట్ వస్తుంది. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారు. రెడ్ల ప్రభుత్వం రావాలని కోరుకున్న వారందరికీ తగిన బుద్ధి వచ్చింది. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొంది. వ్యవసాయం సంక్షోభంలో పడిపోయింది. రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యారు. తప్పు చేసిన వారు తప్పకుండా జైలుకు పోతారు. పొలం కౌలుకు తీసుకుని సాగు చేసే కౌలు రైతులే కరవయ్యారు. నా సొంత పొలాన్ని కౌలుకు ఇద్దామన్నా ఎవరూ ముందుకు రావడం లేదు. సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.500, వెయ్యికి ఆశపడి ఎవరూ బతకొద్దు.. సొంతంగా సంపాదించడం నేర్చుకోండి. సమాజాంలో జరుగుతున్న అక్రమాలపై పాలకులను మీడియా ప్రశ్నించాలి. ప్రశ్నించకుంటే అధోగతి పాలవుతుంది. భూములు ఆక్రమించుకోవడం, ఖజానా నింపుకోవడమే పాలకుల పని. రాష్ట్ర పరిస్థితి, భావితరాల గురించి ఎవరూ ఆలోచించడం లేదు. పేదల బియ్యాన్ని 70శాతం ప్రజలు తినకుండా అమ్ముకుంటున్నారు. సబ్సిడీని నేరుగా లబ్ధిదారులకు అందించాలి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలేదు’’ అని డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని