Ts News: హుజూరాబాద్ ఉపఎన్నిక.. రెండు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌

తాజా వార్తలు

Updated : 28/09/2021 15:17 IST

Ts News: హుజూరాబాద్ ఉపఎన్నిక.. రెండు జిల్లాల్లో అమల్లోకి ఎన్నికల కోడ్‌

హైదరాబాద్‌: హుజూరాబాద్‌లో జరగనున్న ఉప ఎన్నిక నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్ వెల్లడించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికపై శశాంగ్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఈవీఎంల మొదటి దశ తనిఖీ పూర్తయిందని చెప్పారు. ఉప ఎన్నిక నిర్వహణకు 305 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. అవసరమైతే అదనపు పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. నిన్నటివరకు నియోజకవర్గంలో 2,36,269 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఎన్‌ఆర్‌ఐ, సర్వీస్ ఓటర్లను కలిపితే ఓటర్ల సంఖ్య 2,36,430కి చేరుతుందని తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని