ఈటలను కలిసిన మాజీ ఎంపీలు

తాజా వార్తలు

Published : 22/07/2021 01:17 IST

ఈటలను కలిసిన మాజీ ఎంపీలు

హైదరాబాద్: హుజూరాబాద్‌లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాదయాత్రలో ఉన్న మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ను మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్ రెడ్డి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం గూడూరు వద్ద కారులో అరగంటపాటు రహస్యంగా ఈ ముగ్గురు మంతనాలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏం మాట్లాడుకున్నారనేది ఆసక్తిగా మారింది. ఇటీవల కొండా విశ్వేశ్వర్ రెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలిశారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని, ఎప్పుడు చేరేదీ త్వరలోనే చెబుతానని ఆ సందర్భంగా చెప్పారు. ఇంతలోనే ఈటలతో విశ్వేశ్వర్‌ రెడ్డి, జితేందర్ రెడ్డి రహస్యంగా మంతనాలు జరపడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీపై జితేందర్ రెడ్డి కొంత స్పష్టతనిచ్చారు. కేసీఆర్‌ను ఓడించేందుకు అందరు ఒకే ప్లాట్‌ఫామ్ పైకి వచ్చేలా ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని