Huzurabad ByElection: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో 30 మంది అభ్యర్థులు

తాజా వార్తలు

Updated : 14/10/2021 06:29 IST

Huzurabad ByElection: ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు.. బరిలో 30 మంది అభ్యర్థులు

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గుడువు ముగిసింది. 12 మంది అభ్యర్థులు ఇవాళ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్ సతీమణి ఈటల జమున సైతం తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రస్తుతం 30 మంది అభ్యర్థులు ఉప ఎన్నిక బరిలో ఉన్నారు. ఈ నెల 30న హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ జరగనుండగా.. నవంబర్‌ 2వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉంటుంది.

బద్వేల్‌ బరిలో 15 మంది..

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇవాళ ముగ్గురు స్వతంత్ర అభ్యుర్థులు వారి నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. మొత్తంగా 27 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. నామినేషన్ల పరిశీలనలో 9 మందిని అధికారులు తిరస్కరించారు. బద్వేల్‌లో ఈ నెల 30న పోలింగ్‌, నవంబర్‌ 2న లెక్కింపు జరగనుంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని