AP News: శ్రమదానానికి ఆటంకాలు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్‌

తాజా వార్తలు

Updated : 02/10/2021 10:15 IST

AP News: శ్రమదానానికి ఆటంకాలు అప్రజాస్వామికం: నాదెండ్ల మనోహర్‌

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పిలుపిచ్చిన శ్రమదానానికి ఆటంకాలు సృష్టించడం అప్రజాస్వామికమని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ధ్వజమెత్తారు. రోడ్ల మరమ్మతులకు పిలుపునిస్తే పోలీసులు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెల 27తేదీనే డీజీపీకి శ్రమదానం కార్యక్రమం విషయం తెలిపామన్నారు. ఇదే విషయం రాజమహేంద్రవరం అర్బన్‌ ఎస్పీ, అనంతపురం ఎస్పీకి కూడా తెలియజేశామని చెప్పారు.
శ్రమదానంలో పాల్గొనకుండా కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు నిన్న రాత్రి నుంచే పోలీసులు జనసేన అభిమానులను వివిధ పీఎస్‌లకు తీసుకెళ్లారు. ఈ ఉదయం కూడా పవన్‌ సభకు వెళ్తున్న ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలువురిని అదుపులోకి తీసుకొని రాజోలు, ధవళేశ్వరం పీఎస్‌లకు తరలించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని