Janasena: జనసేన ముఖ్యనేతల సమావేశం.. హాజరు కానున్న పవన్‌

తాజా వార్తలు

Updated : 28/09/2021 22:26 IST

Janasena: జనసేన ముఖ్యనేతల సమావేశం.. హాజరు కానున్న పవన్‌

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో బుధవారం ఆ పార్టీ ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో పాల్గొనేందుకు పవన్‌ కల్యాణ్ కూడా ఏపీకి వస్తున్నారు. ఉదయం 10గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చ జరగనుంది. రాష్ట్రంలో పాడైపోయిన రహదారులతో జనం ఇబ్బందులు, ట్రూ అప్‌ ఛార్జీలతో పెరిగిన కరెంటు బిల్లులు, అదనపు వ్యాట్‌ కారణంగా అధికమైన పెట్రో ధరలు, ఇసుక సమస్య, అధికారపార్టీ నేతల దౌర్జన్యాలపై ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో ముందుగా రహదారుల మరమ్మతులు చేసేలా శ్రమదానం చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పవన్‌ నేరుగా జనంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో.. బుధవారం జరిగే సమావేశంలో దానికి సంబంధించి కార్యాచరణ రూపొందించే అవకాశముంది. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ఆయా జిల్లాల అ్యక్షులు, అనుబంధ విభాగాల ఛైర్మన్లు, అసెంబ్లీ ఇంఛార్జిలు ఈ సమావేశంలో పాల్గొంటారు. పార్టీ తరఫున గెలిచిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు.

సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు ప్రభుత్వ విధానాలపై పవన్‌ కల్యాణ్‌ ఇటీవల ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వాటిపై మంత్రులు, వైకాపా నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. పవన్‌ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా వైకాపా నేతలను తూర్పారపడుతున్నారు. పవన్‌ కూడా ట్విటర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కొనసాగిస్తున్నారు. రాజకీయంగా వాతావరణం వేడెక్కిన తరుణంలో జనసేన సమావేశం జరగనుంది. దీంతో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని