AP News: సజ్జల డైరెక్షన్‌లో వంశీ మాట్లాడుతున్నారు: కొల్లు రవీంద్ర

తాజా వార్తలు

Published : 24/10/2021 01:21 IST

AP News: సజ్జల డైరెక్షన్‌లో వంశీ మాట్లాడుతున్నారు: కొల్లు రవీంద్ర

అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మాజీ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వంశీ మాట్లాడుతున్న భాష చాలా దారుణంగా ఉందని, కృష్ణా జిల్లాకు చెడ్డపేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు వెన్నుపోటు పొడిచి. తెలుగుదేశం పార్టీ గుర్తుపై గెలిచిన వంశీ.. ఇవాళ చంద్రబాబు, లోకేశ్‌ గురించి మాట్లాడుతున్నారు. వంశీ మాట్లాడుతున్న భాష వింటే ఆయన భార్య, పిల్లలు కూడా సిగ్గుపడే పరిస్థితి. కృష్ణా జిల్లా మహిళలను కించపరిచేలా వంశీ వ్యాఖ్యలు ఉన్నాయి. ఆయన ఇంట్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. చంద్రబాబు భిక్షతో ఎమ్మెల్యే అయిన వంశీ.. సజ్జల డైరెక్షన్‌లో మాట్లాడుతున్నారు’’ అని కొల్లు రవీంద్ర ఆరోపించారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని