KTR: ఈటల కోసం కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 19/10/2021 11:56 IST

KTR: ఈటల కోసం కాంగ్రెస్‌ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టింది: కేటీఆర్‌

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో దమ్ముంటే కాంగ్రెస్‌ పార్టీ డిపాజిట్‌ తెచ్చుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. హుజూరాబాద్‌లో భాజపా, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ కోసం కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని కేటీఆర్‌ అన్నారు. హుజూరాబాద్‌లో తప్పకుండా తెరాస గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్‌ చిలకజోస్యం చెప్పుకుంటే మంచిదని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్‌లో జర్నలిస్టులతో ఇష్టాగోష్ఠిలో కేటీఆర్‌ పలు విషయాలపై మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికల ప్రచారానికి తాను వెళ్లడం లేదని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్‌, దుబ్బాక ప్రచారానికీ తాను వెళ్లలేదన్నారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రచారం ఇంకా ఖరారు కాలేదని కేటీఆర్‌ చెప్పారు.

అది వాట్సప్‌ యూనివర్సిటీ ప్రచారం..

‘‘కొంతకాలం తర్వాత ఈటలను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తారు. వివేక్‌ కూడా కాంగ్రెస్‌లోకి వెళ్తారని వినిపిస్తోంది. కాంగ్రెస్‌లో భట్టి విక్రమార్క మంచి వ్యక్తి. కాంగ్రెస్‌లో భట్టి మాట నెగ్గట్లేదు.. గట్టి అక్రమార్కులదే నెగ్గుతోంది. తెలంగాణ పథకాలు దేశానికి దిక్సూచిగా మారాయి. కేసీఆర్‌ విజనరీ. మిగతా పార్టీల నేతలు టెలివిజనరీలు. రేవంత్‌ పీసీసీ అధ్యక్షుడిగా తొలి ఎన్నికలో నిరూపించుకోవాలి కదా. రేవంత్‌రెడ్డి ఎందుకు హుజూరాబాద్‌ వెళ్లట్లేదు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని ఎందుకు చేయలేదు. నవంబర్‌ 3 తర్వాత దళితబంధును ఎవరూ ఆపలేరు. కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి  వెళ్లడం సందర్భం బట్టి ఉంటుంది. కేసీఆర్‌ ఉప రాష్ట్రపతి అనేది వాట్సప్‌ యూనివర్సిటీ ప్రచారం.

నవంబర్‌ 15న ప్రయాణాలు పెట్టుకోవద్దు

తెరాస అధ్యక్ష పదవికి సీఎం కేసీఆర్‌ను ప్రతిపాదిస్తూ 10 నామినేషన్లు దాఖలు అయ్యాయి. ద్విదశాబ్ది వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. నవంబర్‌ 15న వరంగల్‌లో నిర్వహించే విజయగర్జన సభకు భారీగా ఆర్టీసీ బస్సులు తీసుకుంటాం. ఆరోజు ప్రజలు ప్రయాణాలు పెట్టుకోవద్దు. 20 రోజుల్లో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ 100శాతం పూర్తి చేస్తాం. నవంబర్‌ 15 తర్వాత నేను, మరికొందరు తమిళనాడు వెళ్తాం. డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల నిర్మాణాన్ని అధ్యయనం చేస్తాం. నీట్‌ రద్దుపై తమిళనాడు సీఎం స్టాలిన్‌తో 100శాతం ఏకీభవించలేం. తెలంగాణ విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లో ఎంబీబీఎస్‌ చేస్తున్నారు. రాష్ట్ర విద్యార్థులకు ఏది మేలైతే ఆ నిర్ణయం తీసుకుంటాం’’ అని కేటీఆర్‌ అన్నారు. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని