Pawan Kalyan: వైకాపా పాలనలో ‘అడుగుకో గుంత.. గజానికో గొయ్యి’: పవన్‌ కల్యాణ్‌

తాజా వార్తలు

Updated : 01/09/2021 12:53 IST

Pawan Kalyan: వైకాపా పాలనలో ‘అడుగుకో గుంత.. గజానికో గొయ్యి’: పవన్‌ కల్యాణ్‌

అమరావతి: వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితి ‘అడుగుకో గుంత.. గజానికో గొయ్యి’లా మారిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ విమర్శించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశ వ్యాప్తంగా రోడ్ల వ్యవస్థను పటిష్ఠం చేస్తుంటే.. ఏపీలో ఈ వ్యవస్థ దారుణంగా ఉందని చెప్పారు. ఈ మేరకు జనసేన పార్టీ పవన్‌ వీడియో సందేశాన్ని విడుదల చేసింది. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించినప్పుడు దెబ్బతిన్న రోడ్లను ప్రత్యక్షంగా చూశానని పవన్‌ చెప్పారు. రోడ్ల బాగు కోసం ప్రశ్నించిన వారిపై వేధింపులు, అరెస్టులను ఆయన తప్పుపట్టారు.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లక్షా 20 వేల కిలోమీటర్లకు పైగా రోడ్లు ఉన్నాయని.. అవి మరమ్మతులు గురైతే బాగుపడటం లేదని విమర్శించారు. రోడ్ల దుస్థితిని ప్రజల్లోకి తీసుకెళ్లి తద్వారా ప్రభుత్వంలో స్పందన తీసుకురావాలన్నారు. అందుకోసం సెప్టెంబర్ 2, 3, 4 తేదీల్లో #JSPFORAP_ROADS హ్యాష్‌ ట్యాగ్‌ ద్వారా ప్రతి ఒక్క జనసైనికుడు, వీర మహిళ, ఊరు బాగు కోరే ప్రతి ఒక్కరూ పాడైన రోడ్ల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో గాంధీ జయంతి రోజున శ్రమదానంతో రోడ్లను బాగు చేద్దామని పవన్‌ సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని