Ap News: జనసేనది ప్రజాపక్షం.. ఎవరికీ భయపడేది లేదు: పవన్‌ కల్యాణ్‌

తాజా వార్తలు

Published : 25/10/2021 01:34 IST

Ap News: జనసేనది ప్రజాపక్షం.. ఎవరికీ భయపడేది లేదు: పవన్‌ కల్యాణ్‌

విజయవాడ‌: జనసేన చేపట్టే ఏ కార్యక్రమమైనా సామాన్య ప్రజానీకం కష్టాలను, వారు ఎదుర్కొంటున్న రాజకీయ ఒత్తిళ్లను దూరం చేసేలా ఉండాలని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఛిద్రమైన రహదారులకు సంబంధించి ప్రజాస్వామ్య పద్ధతిలో శ్రమదానం ద్వారా మరమ్మతులను చేపడితే ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలంతా చూశారన్నారు. జనసేన చేపట్టిన శ్రమదాన కార్యక్రమానికి జాతీయ స్థాయిలో సానుకూల స్పందన వచ్చిందని.. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పార్టీ శ్రేణులకు పవన్‌ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లాల అధ్యక్షులతో పవన్‌ భేటీ అయ్యారు. జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధే జనసేన లక్ష్యమని పవన్‌ అన్నారు. జనసేనది ప్రజాపక్షమని.. ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ప్రతి అంశాన్ని ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా జనసేన నిలుస్తుందన్నారు. ప్రతి జిల్లాలో పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని.. జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడే స్థానిక అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు. జిల్లాల అధ్యక్షులు, కార్యవర్గం పార్టీ శ్రేణులను అనుసంధానం చేసుకొని ముందుకు తీసుకువెళ్లాలని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని