Rahul Gandhi: ధరల పెరుగుదల, రైతుల మృతిపై ప్రధాని మౌనం: రాహుల్‌ విమర్శ

తాజా వార్తలు

Published : 11/10/2021 02:07 IST

Rahul Gandhi: ధరల పెరుగుదల, రైతుల మృతిపై ప్రధాని మౌనం: రాహుల్‌ విమర్శ

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా లఖింపుర్‌ ఖేరి హింసాత్మక ఘటనలో రైతులు ప్రాణాలు కోల్పోయినప్పటికీ ప్రధాన మంత్రి స్పందించకపోవడంపై ప్రశ్నించారు. ధరల పెరుగుదలతో పాటు రైతులు, భాజపా నాయకుల మృతిపై ప్రధాని మౌనంగా (Silent) ఉంటారని.. కానీ, ఆయనను విమర్శించినపుడు లేదా తన స్నేహితుల గురించి ప్రశ్నించినప్పుడు మాత్రమే ప్రధాని ఎదురుదాడికి దిగుతారని ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఇక తూర్పు లద్దాఖ్‌ నెలకొన్న ప్రతిష్టంభనను ప్రస్తావిస్తూ చైనాపై ఆర్మీ చీఫ్‌ ఎంఎం నరవణె చేసిన వ్యాఖ్యలపైనా రాహుల్‌ గాంధీ విమర్శలు చేశారు.

మరోవైపు లఖింపుర్‌ ఖేరి ఘటనకు సంబంధించిన వాస్తవాలను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వివరించేందుకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల బృందం సిద్ధమైంది. ఇందుకు అనుమతి కోరుతూ రాష్ట్రపతి భవన్‌ తాజాగా లేఖ రాసింది. ఈ బృందంలో రాహుల్‌ గాంధీతో పాటు ప్రియాంకా గాంధీ వాద్రా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఏకే ఆంటోని, మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్‌, గులాం నబీ ఆజాద్‌, అధీర్‌ రంజన్‌ ఛౌదురి రాష్ట్రపతిని కలవనున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని