Ap News: వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చండి

తాజా వార్తలు

Updated : 16/07/2021 18:59 IST

Ap News: వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చండి

సీఎం జగన్‌కు ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేల లేఖ

ప్రకాశం: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న, పూర్తయిన ఐదు ప్రాజెక్టులను మాత్రమే గెజిట్‌ లో పేర్కొనడం విభజన చట్టానికి పూర్తి విరుద్ధమని ప్రకాశం జిల్లా తెదేపా ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. ఆ జాబితాలో వెలిగొండ ప్రాజెక్టును చేర్చేలా బాధ్యత తీసుకోవాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవి కుమార్‌, బాలవీరాంజనేయ స్వామి.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు.  గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టును అనుమతులు లేని ప్రాజెక్టుగా చూపించడం ప్రకాశం జిల్లాకు పిడుగుపాటు లాంటిదని ఆందోళన వ్యక్తం చేశారు.

‘‘తెలుగు రాష్ట్రాల్లోని హంద్రీనీవా, తెలుగు గంగ, గాలేరునగరి, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను పూర్తి చేయాలని 11వ షెడ్యూల్‌, సెక్షన్‌ 85 (7ఈ)లో స్పష్టంగా ఉంది. గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెలిగొండ మినహా మిగిలిన ఐదు ప్రాజెక్టులను జాబితాలో చూపించటం ప్రాజెక్టు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయడమే అవుతుంది. ప్రాజెక్టు నిర్మాణం తుదిదశకు చేరుకున్న తరుణంలో ఈ చర్య కరువుతో కొట్టుమిట్టాడుతున్న ప్రకాశం జిల్లాకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. రాయలసీమ ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు కలిగే నష్టాలు వివరిస్తూ ఇప్పటికే లేఖ రాసినా ఇంతవరకు స్పందించలేదు. వైకాపా సర్కార్‌ అధికారం చేపట్టిన ఏడాదిలో వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చి రెండేళ్లు అయింది. ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రాజెక్టుని వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపైనా పునరాలోచన చేయాలి’’ అని లేఖలో పేర్కొన్నారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని