Raghurama: సజ్జల సకలశాఖ మంత్రిగా ... సకల విషయాలు చూస్తారా?: రఘురామకృష్ణరాజు

తాజా వార్తలు

Published : 15/10/2021 01:23 IST

Raghurama: సజ్జల సకలశాఖ మంత్రిగా ... సకల విషయాలు చూస్తారా?: రఘురామకృష్ణరాజు

దిల్లీ: అమ్మఒడి నిధులు జూన్‌కు మార్చడంతో ఒక ఏడాది ఎగ్గొట్టినట్టేనని నరసాపురం వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. గురువారం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... జగన్‌ నవరత్నాల్లో ఒకటి రాలిపోయిందని విమర్శించారు. అమ్మ ఒడిని నమ్ముకున్న చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాష్ట్రంలో అప్పుల సేకరణపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

‘‘రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై కోల్‌ ఇండియా ఛైర్మన్‌తో చర్చించా. రాష్ట్రాలు బొగ్గు నిల్వల పెంపునకు యత్నించాలని చెప్పారు. కోల్‌ ఇండియాకు ఏపీ రూ.300 కోట్లు బాకీ ఉన్నట్టు చెప్పారు. 25 ఏళ్లవి రద్దు చేసి 30 ఏళ్ల  ఒప్పందాలు చేసుకున్నారు. జగనన్నవి కొవ్వొత్తి, అగ్గిపెట్టె పథకాలని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఏ సమస్య అయినా ప్రభుత్వ సలహాదారు సజ్జలే మాట్లాడుతున్నారు. సజ్జల ఒక్కోసారి సీఎంగా కూడా వ్యవహరిస్తున్నారు. సజ్జల సకలశాఖ మంత్రిగా .. సకల విషయాలు చూస్తారా? జగన్‌ ప్రభుత్వం వచ్చాక రూ.2.87 లక్షల కోట్ల అప్పులు చేశారు. రాష్ట్ర ఖజానాలో రూ.1.31లక్షల కోట్ల లెక్కలు తేలట్లేదు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వ ఆదాయ వ్యయాలు, అప్పలు వివరాలు విడుదల చేయాలి’’ అని రఘురామకృష్ణరాజు అన్నారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని