Ap News: రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు: బాలకృష్ణ

తాజా వార్తలు

Updated : 17/10/2021 17:08 IST

Ap News: రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు: బాలకృష్ణ

హిందూపురం‌: రాయలసీమకు నీటి కోసం అవసరమైతే దిల్లీకి వెళ్లి పోరాటం చేస్తామని ఎమ్మెల్యే బాలకృష్ణ స్పష్టం చేశారు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల భవిష్యత్తులపై అనంతపురం జిల్లా హిందూపురంలో సీమ తెదేపా నేతలు సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ హాజరయ్యారు. సీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు ఈ సదస్సుకు హాజరయ్యారు. రాయలసీమ అభివృద్ధికి ఎన్టీఆర్‌ ఎంతో కృషి చేశారని బాలకృష్ణ గుర్తు చేశారు. సీమ కోసం ఎన్టీఆర్‌ హంద్రీనీవా ప్రాజెక్టును తీసుకొచ్చారని పేర్కొన్నారు. హంద్రీనీవా ద్వారా చెరువులకు నీరిచ్చే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమకు నీరిచ్చే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదని ఆక్షేపించారు. బీటీ ప్రాజెక్టుకు, చెరువులకు, అనంత జిల్లాలోని అన్ని చెరువులకు వెంటనే నీరివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని