TS News: లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు నాకే: రేవంత్‌  

తాజా వార్తలు

Updated : 02/10/2021 15:20 IST

TS News: లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు నాకే: రేవంత్‌  

హైదరాబాద్‌: తెలంగాణలో నిరుద్యోగ జంగ్‌ సైరన్ పేరుతో ఇవాళ కాంగ్రెస్‌ చేపడుతున్న నిరసన ర్యాలీలో లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు తనకే తగులుతుందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన గాంధీభవన్‌లో మహాత్మునికి నివాళులర్పించారు. అనంతరం ఆయన జంగ్‌ సైరన్‌ కార్యక్రమంపై మీడియాతో మాట్లాడారు. ‘‘గాంధీ జయంతి వేళ శాంతియుత నిరసనలు చేపడుతున్నాం. విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలి. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎల్బీ నగర్‌ వరకు పాదయాత్ర ఉండనుంది. పోలీసులు జంగ్‌ సైరన్‌ ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయి. పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు’’ అని రేవంత్‌ అన్నారు. విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై  ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్‌ సైరన్‌’ పేరిట కాంగ్రెస్‌ పార్టీ చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు ఇవాళ్టి నుంచి మొదలు కానున్నాయి. 



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని