Revanth reddy: తెలంగాణ విముక్తి కోసమే ఈ పోరాటం: రేవంత్‌రెడ్డి

తాజా వార్తలు

Updated : 22/09/2021 20:03 IST

Revanth reddy: తెలంగాణ విముక్తి కోసమే ఈ పోరాటం: రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ విముక్తి కావాలంటే గులాబీ చీడ వదిలించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేసీఆర్‌ ఆటలు ఇక తెలంగాణ గడ్డపై సాగవని హెచ్చరించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతుల్లో బందీ అయిందని, వారి నుంచి విముక్తి కోసమే ఈ పోరాటమని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై తీవ్ర విమర్శలు చేశారు. ధర్నా చౌక్‌ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టి కొట్లాడినట్టుందని, పోడు భూముల కోసం రాష్ట్రంలో కొట్లాట మొదలైందన్నారు.

హరితహారం ముసుగులో పోడు భూములను గుంజుకుంటున్నారని రేవంత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో దోచుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రజా రవాణా సంస్థలు, అన్నీ తెగనమ్ముతున్నారని దుయ్యబట్టారు. అందరం అనుకుంటే కేసీఆర్‌ను గద్దె దించడం పెద్ద పనేం కాదన్న రేవంత్‌.. ప్రధాని మోదీ జాతి సంపదను పారిశ్రామిక వేత్తలకు పంచిపెడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రం, దేశం ప్రమాదంలో పడిందని ఆరోపించారు. ఈనెల 27న భారత్‌ బంద్‌ విజయవంతం చేయాలని, తెలంగాణ బంద్‌ సంపూర్ణంగా జరగాలని పిలుపునిచ్చారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని